2015-07-04



పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చిరంజీవి 150వ సినిమా ఉంటుందని స్వయంగా రాంచరణ్ ప్రకటించాడు. అంతే కాదు 150 సినిమాకు సంబంధించిన ఫస్ట్ పార్ట్ నరేషన్ కూడా చెప్పాడు. మొదటి భాగం విని చిరు కూడా హ్యాపీగా ఫీలయ్యాడని , సెకండాఫ్ దానికి పది రెట్టు ఉండేలా స్టోరీ రెడీ చేస్తున్నట్టు పూరీ ట్విట్టర్లో పెట్టుకున్నాడు. కానీ ఆ తర్వాత వినాయక్ ను పిలిచి చిరు మీటింగ్ పెట్టడంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పూరీ జగన్నాథ్ చిరంజీవి సినిమా క్యాన్సిల్ అయ్యిందనే ప్రచారం జరిగింది. ఇప్పుడీ వార్త నిజమేనని విశ్వసనీయ వర్గాల సమాచారం.
చిరంజీవి 150వ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించనున్నాడని సమాచారం. ఇప్పటికే వీరి మధ్య కథా చర్చలు కూడా జరిగాయి. నయనతార, తమన్నా హీరోయిన్స్ గా నటించనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మరి కొద్దిరోజుల్లోనే రానుంది. అయితే పూరీని కాదని వినాయక్ ను తీసుకోవడానికి గల కారణాలు ఇంకా బయటికి రాలేదు.

Show more